వైఎస్‌ జగన్‌కు ఇవే ఆఖరి రోజులు: నారా లోకేష్‌

ప్రజాగళం సభకు వెళ్లాడనే కక్షతో ప్రకాశం జిల్లాకు చెందిన మునయ్య అనే కార్యకర్తను వైసీపీ శ్రేణులు చంపేశాయని టీడీపీ నేత నారా లోకేష్‌ ఆరోపించారు.

By అంజి
Published on : 20 March 2024 1:29 PM IST

Nara Lokesh, CM YS Jagan, APnews

వైఎస్‌ జగన్‌కు ఇవే ఆఖరి రోజులు: నారా లోకేష్‌

ప్రజాగళం సభకు వెళ్లాడనే కక్షతో ప్రకాశం జిల్లాకు చెందిన మునయ్య అనే కార్యకర్తను వైసీపీ శ్రేణులు చంపేశాయని టీడీపీ నేత నారా లోకేష్‌ ఆరోపించారు. జగన్‌ గొడ్డలి పార్టీకి రక్తదాహం మరింత పెరిగిపోయిందన్నారు. గిద్దలూరు మండలం గడికోట పంచాయతీకి చెందిన పాముల మునయ్య టిడిపిలో చేరిన రోజే చంపేస్తామని హెచ్చరించారని లోకేష్‌ తెలిపారు. ఓటమి భయంతో వైసీపీ శ్రేణులు మునయ్యను చంపేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని అన్నారు.

జగన్‌, ఆయన సైన్యానికి, గొడ్డలి దాడులకు ఇవే ఆఖరి రోజులని, దోషులను చట్టం ముందు నిలబెడతామని నారా లోకేష్‌ వెల్లడించారు. బాబాయ్‌పై అబ్బాయి గొడ్డలి వేటేసి అధికారం దక్కించుకున్నాడని అన్నారు. ఆ అధికారం పోతుందనే భయంతో తెలుగుదేశం జెండా పట్టిన కార్యకర్తలపై గొడ్డలి ఎత్తుతున్నారని లోకేష్‌ ఆరోపించారు. మునయ్య కుటుంబానికి టిడిపి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. ఇవాళ మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి లోని వివిధ అపార్ట్మెంట్టుల్లో నివసిస్తున్న వారితో నారా లోకేష్‌ భేటీ అయ్యారు. వారు ఎదుర్కుంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గం, రాష్ట్ర అభివృద్ధి కి తీసుకోవాల్సిన చర్యల గురించి వారు అనేక సూచనలు ఇచ్చారు. గెలిచిన వెంటనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యడానికి తన వద్ద ఉన్న ఆలోచనలను నారా లోకేష్‌ వారితో పంచుకున్నారు.

Next Story