ప్రజలంతా మీవైపే ఉంటే.. తమ అభ్యర్థులపై దాడులు ఎందుకు.. నారా లోకేష్‌ ఫైర్‌

Nara Lokesh is angry with the government of CM Jagan. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన ఘటనలపై టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ స్పందించారు. తమ అభ్యర్థులపై దాడులు

By అంజి  Published on  5 Nov 2021 12:27 PM GMT
ప్రజలంతా మీవైపే ఉంటే.. తమ అభ్యర్థులపై దాడులు ఎందుకు.. నారా లోకేష్‌ ఫైర్‌

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన ఘటనలపై టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ స్పందించారు. తమ అభ్యర్థులపై దాడులు ఎందుకంటూ నారా లోకేష్‌ ట్విటర్‌ వేదికగా ఫైర్‌ అయ్యారు. ఈ హిట్లర్‌ గిరీ ఎందుకంటూ మండిపడ్డారు. రాష్ట్ర‌ ప్ర‌జ‌లంతా మీవైపు ఉంటే తిరుప‌తి ఉప ఎన్నిక‌ల‌కి దింపిన వేలాది మంది దొంగ ఓట్ల ప‌ర్యాట‌కులను టీడీపీ పోటీచేయ‌ని బ‌ద్వేలు ఉప ఎన్నిక‌ల‌కీ ఎందుకు దింపాల్సి వ‌చ్చింది అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ప్రశ్నించారు. స్థానిక సంస్థ‌ల్లో 85 శాతం ప్ర‌జ‌లు మా వైపే అని మీరు ప్ర‌క‌టిస్తారు. 80 ఏళ్ల మా అంజిరెడ్డి తాత నామినేష‌న్ ప‌త్రాలు చింపేస్తారు. మున్సిపాల్టీలు, కార్పొరేష‌న్ల‌లోనూ ఎదురులేని ప్ర‌జాబ‌లం అని ఉత్త‌ర కుమారుడిలా మీరు రాసిన ఉత్త‌రాలు, స‌ల‌హాలను స‌జ్జ‌ల మీడియాకి వినిపిస్తారు అంటూ లోకేష్ విమర్శలు చేశారు.

వైసీపీకి అంత ప్ర‌జాబ‌లం ఉంటే, కుప్పం మున్సిపాలిటీ 14వ వార్డు అభ్య‌ర్థిగా నామినేష‌న్ వేసేందుకు వెళ్తోన్న వెంక‌టేశ్‌పై వైసీపీ మూక‌లు దాడిచేసి నామినేష‌న్ ప‌త్రాలు ఎందుకు లాక్కున్నారు?, తూర్పుగోదావ‌రి జిల్లా కాచ‌వ‌రం పంచాయ‌తీ 1వ వార్డుకి వేసిన‌ నామినేష‌న్ ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని.. గిరిజ‌న మ‌హిళ శిరీష‌ని వైసీపీ నేత వెంక‌న్న ఎందుకు బెదిరించారు? గుర‌జాల న‌గ‌ర‌పంచాయ‌తీలో నామినేష‌న్ వేసేందుకు వ‌చ్చిన మైనారిటీ మ‌హిళ న‌జీమున్ పై ఎందుకు దాడి చేశారు? అంటూ నారా లోకేష్‌ ప్రశ్నించారు. వైసీపీది అస‌లు సిస‌లైన ప్ర‌జాబ‌లమైతే.. పంచాయ‌తీ వార్డు నుంచి పార్లమెంట్ స్థానం వ‌ర‌కూ గెలుపు కోసం ఇలా ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేయాల్సిన అవ‌స‌ర‌మేంటని నారా లోకేష్‌ అన్నారు. ఎన్నిక‌ల క‌మిష‌న్‌, అధికార‌యంత్రాంగం, పోలీసుల్ని వాడుకుని పోటీయే లేకుండా చేయాల‌నే ఈ హిట్ల‌ర్ గిరీ ఎందుకు? అంటూ లోకేష్‌ నిలదీశారు.

Next Story