పోలీసుల ప్రాణాలకే రక్షణ లేకపోతే.. ప్రజల పరిస్థితి ఏంటి.?

Nara Lokesh Fire On Govt. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ట్విట‌ర్ వేదిక‌గా ఏపీ ప్ర‌భుత్వంపై

By Medi Samrat  Published on  9 Aug 2022 12:18 PM GMT
పోలీసుల ప్రాణాలకే రక్షణ లేకపోతే.. ప్రజల పరిస్థితి ఏంటి.?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ట్విట‌ర్ వేదిక‌గా ఏపీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. నంద్యాల‌లో కానిస్టేబుల్ రౌడీ షీట‌ర్ల చేతిలో హ‌త‌మైన విష‌యం తెలిసిందే. ఈ విష‌య‌మై లోకేష్ స్పందిస్తూ.. పోలీసుల ప్రాణాలకే రక్షణ లేకపోతే ఇక ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్ర‌శ్నించారు. వైసీపీ రాక్ష‌స‌పాల‌న‌లో పోలీసుల‌ ప్రాణాల‌కీ ర‌క్ష‌ణ లేకుండా పోయిందని అన్నారు. నంద్యాల డీఎస్పీ ఆఫీసులో ప‌నిచేసే కానిస్టేబుల్ గూడూరు సురేంద్రకుమార్ ని ప‌ట్ట‌ణం న‌డిమ‌ధ్య‌లో అంద‌రూ చూస్తుండ‌గానే దారుణంగా హ‌త్య చేశారు రౌడీషీట‌ర్లు.

జ‌గ‌న్‌రెడ్డి రాజ్యం నేర‌గాళ్ల స్వ‌ర్గ‌మైందని రౌడీషీట‌ర్లు నిరూపించారని విమ‌ర్శించారు. ఒక కాకి చ‌నిపోతుంది.. సాటి కాకులు అరుస్తూ గోల చేస్తాయి. ఒక ఖాకీని చంపేస్తే.. నిందితులైన రౌడీషీట‌ర్లు ఎవ‌రో తెలిసినా ఇప్ప‌టికీ ఖాకీ బాస్‌లు ప‌ట్టుకోలేదంటే.. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు ఎంత ఘోరంగా ఉన్నాయో తేట‌తెల్లం అవుతోందని అన్నారు. కానిస్టేబుల్ సురేంద్రకుమార్ ను అత్యంత దారుణంగా హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి. కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు.



Next Story