చంద్రన్న మార్గమే రాజమార్గం అంటున్న నారా లోకేష్

Nara Lokesh About Jagan Davos Visit. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో పాల్గొనేందుకు విజయవాడ

By Medi Samrat  Published on  21 May 2022 9:41 AM GMT
చంద్రన్న మార్గమే రాజమార్గం అంటున్న నారా లోకేష్

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో పాల్గొనేందుకు విజయవాడ నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరి వెళ్లిన సీఎం వైఎస్‌ జగన్‌ దావోస్‌ చేరుకున్నారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు అక్కడ డబ్ల్యూఈఎఫ్‌ సదస్సు లో పాల్గొననున్నారు. సీఎం జగన్ టూర్ పై టీడీపీ నేత నారా లోకేష్ కౌంటర్లు వేశారు. ఒకప్పుడు దావోస్ పర్యటనపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారని.. ఇప్పుడు అదే నాయకులు దావోస్ కు వెళుతున్నారన్నారు.

"మా నాన్నని ద్వేషించేవారు, విమర్శించేవారు సైతం ఆఖరికి ఆయన మార్గంలో నడవాల్సిందే. సంక్షేమం నుండి ఐటి వరకూ.. అమరావతి నుండి విదేశాలు వెళ్లి పెట్టుబడులు ఆకర్షించడం వరకూ చంద్రన్న మార్గమే రాజమార్గం. దావోస్ ఎందుకు డబ్బులు దండగ అన్న జగన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా స్పెషల్ ఫ్లైట్ లో దావోస్ పర్యటన కు వెళ్లాల్సి వచ్చింది. బహుశా దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమో" అంటూ ట్వీట్లు వేశారు నారా లోకేష్.

దావోస్ కు పయనమైన వైఎస్ జగన్ లండన్ కు వెళ్లారంటూ టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. అధికారులతో కలిసి అధికారిక పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్... తన భార్య భారతితో కలిసి లండన్ కు వెళ్లారని చెపుతున్నారు. ప్రత్యేక విమానంలో జగన్, భారతి, మరో వ్యక్తి మాత్రమే లండన్ కు వెళ్లారని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనపై ప్రశ్నలు కురిపిస్తున్నారు. ప్రజాధనంతో సీఎం జగన్ పర్సనల్ టూర్లు వేశారని టీడీపీ సీనియర్ నేతలు విమర్శలు గుప్పించారు.












Next Story