ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. నారా భువనేశ్వరికి తప్పిన ప్రమాదం

గన్నవరం ఎయిర్ పోర్టులో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్ సమయంలో ల్యాండింగ్ వీల్ ఓపెన్

By Medi Samrat  Published on  30 Jan 2024 8:45 PM IST
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. నారా భువనేశ్వరికి తప్పిన ప్రమాదం

గన్నవరం ఎయిర్ పోర్టులో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్ సమయంలో ల్యాండింగ్ వీల్ ఓపెన్ కాకపోవడంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని గాల్లోలోనే మూడుసార్లు చక్కర్లు కొట్టించారు. అనంతరం తిరిగి ల్యాండ్ అవుతుండగా ల్యాండింగ్ వీల్ ఓపెన్ కావడంతో విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. ఆ సమయంలో విమానంలో మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఉన్నారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇక ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టులో పొగమంచు కారణంగా షార్జా నుంచి వచ్చిన ఎయిర్‌ ఇండియా, చెన్నై నుంచి వచ్చిన ఇండిగో విమానాలు గాలిలో చక్కర్లు కొట్టాయి. విమానాలు గాలిలో చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు, అధికారులు భయాందోళనకు గురయ్యారు. వాతావరణం కాస్త అనుకూలించడంతో పైలెట్లు చాకచక్యంగా విమానాలను గన్నవరం ఎయిర్‌పోర్టులో సేఫ్‌గా ల్యాండ్‌ చేశారు.

Next Story