ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి కృష్ణా జిల్లా కొమరువోలు గ్రామంలో పర్యటించారు. ఈ గ్రామాన్ని నారా భువనేశ్వరి దత్తత తీసుకున్నారు. ఆ సమయంలో ఆమె గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. తనను మేడమ్ అని పిలవొద్దని, నేను మీ భువనమ్మను అని చెప్పారు. కొమరవోలుకు రావడం సంతోషంగా ఉందని భువనేశ్వరి చెప్పారు. కొమరవోలును తాను ఎప్పుడూ మర్చిపోనని, గ్రామస్తులందరూ ఒక కుటుంబం లాగా కలిసి ఉండాలని అన్నారు. అందరం కలిసి గ్రామానికి మంచి చేసుకుందామని చెప్పారు.
ప్రజలు అడిగినవి చిన్న చిన్న సమస్యలని నారా భువనేశ్వరి చెప్పారు. ఇచ్చిన హామీలతోపాటు సమస్యలన్నింటిని సీఎం చంద్రబాబు పరిష్కరిస్తారని అన్నారు. గ్రామంలో విభేదాలు ఉంటే మాట్లాడుకొని పరిష్కరించాలని, వర్గాలను పక్కన పెట్టాలని సూచించారు. గ్రామస్తులందరూ కుటుంబం మాదిరి కలిసి ఉండాలని సూచించారు.