నా భర్త చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారు: భువనేశ్వరి
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ట్రీట్మెంట్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
By అంజి Published on 13 Oct 2023 12:29 PM ISTనా భర్త చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారు: భువనేశ్వరి
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఎమర్జెన్సీ హెల్త్ ట్రీట్మెంట్ అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ మేరకు నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు.
''నా భర్త జైలులో ఉన్న సమయంలో ఆయనకు అత్యవసరంగా అవసరమైన వైద్యాన్ని సకాలంలో అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైనందున, నా భర్త క్షేమం గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. అతను ఇప్పటికే 5 కిలోల బరువు కోల్పోయాడు. ఇంకా చంద్రబాబు బరువు తగ్గితే అతని కిడ్నీలపై ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెబుతున్నారు. జైలులో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. ఈ భయంకరమైన పరిస్థితులు నా భర్త జీవితానికి స్పష్టమైన, తక్షణ ముప్పును తలపెట్టేలా ఉన్నాయి'' అని అన్నారు.
I am deeply concerned for my husband's well-being, as the Govt of Andhra Pradesh has failed to provide him with the timely medical care he urgently needs while he remains in prison. He has already lost 5 kg weight, and any further weight loss could have severe consequences for…
— Nara Bhuvaneswari (@ManagingTrustee) October 13, 2023
మరోవైపు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో కథనాలు రావడంతో జైలు సూపరింటెండెంట్ రాజ్‌కుమార్ .. చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. జైలులోని డాక్టర్లకు చంద్రబాబు తన చర్మ సమస్యను చెప్పారు. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఇద్దరు వైద్యులు వచ్చి చంద్రబాబు ఆరోగ్యం పై పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందన్న జైలు అధికారులు తెలిపారు. ఎటువంటి భయాందోళన, అపోహలకు గురికావద్దని జైలు అధికారులు వెల్లడించారు. వైద్యులు సూచించిన మందులను అందిస్తామని వెల్లడించారు.