శ్రీశైలంలో నారా భువనేశ్వరి

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి శ్రీశైలంకు వచ్చారు

By Medi Samrat  Published on  3 Aug 2024 6:00 PM IST
శ్రీశైలంలో నారా భువనేశ్వరి

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి శ్రీశైలంకు వచ్చారు. భువనేశ్వరి శ్రీశైలంలోని భ్రమరాంబికా మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు, అధికారులు, ఆలయ అర్చకస్వాములు నారా భువనేశ్వరికి స్వాగతం పలికారు.

ఆమె వల్ల భక్తులు ఇబ్బందులు పడకూడదని తొందరగా వెళ్ళిపోయారు భువనేశ్వరి. తన కోసం భక్తులు ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దని అధికారులను భువనేశ్వరి కోరారు. అలాంటి హడావిడి వద్దని ముందుగానే చెప్పినట్లు తెలుస్తోంది. ఆమె వెంట శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సతీమణి శైలజమ్మ ఉన్నారు.

మల్లికార్జునస్వామిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం నాడు దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఆలయానికి వచ్చిన సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి, శాలువతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.

Next Story