వారికి వార్నింగ్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు.

By Medi Samrat
Published on : 5 May 2025 8:09 PM IST

Andrapradesh, Hindupuram Mla Balakrishna, Tdp, Ysrcp

వారికి వార్నింగ్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు. సీమ జోలికి వచ్చినా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వచ్చినా సహించేది లేదని హెచ్చరించారు. వీలైతే అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని, విమర్శలు చేయడం మానుకోవాలని వైసీపీకి బాలకృష్ణ హితవు పలికారు. హిందూపురం మండలం ఇందిరమ్మ కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాలను బాలకృష్ణ పంపిణీ చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు హిందూపురం రెండో పుట్టినిల్లు లాంటిదని, తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాకముందే హిందూపురంలో రూ. 50 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేయించామన్నారు.

హిందూపురం నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.136 కోట్లతో సమగ్ర నివేదికలు సిద్ధం చేశామని బాలకృష్ణ తెలిపారు. త్వరలోనే మున్సిపాలిటీ పరిధిలో అధునాతన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 1984లోనే ఎన్టీఆర్ ముందుచూపుతో తూముకుంట వద్ద పారిశ్రామిక వాడను ఏర్పాటు చేశారని, ఆ విషయాన్ని హిందూపురం ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు.

Next Story