ఏపీ మంత్రులపై నాగబాబు సెటైర్లు

మెగాస్టార్ చిరంజీవి తన సినిమా వాల్తేరు వీరయ్య 200వ రోజు వేడుక సందర్భంగా మాట్లాడిన మాటలపై

By Medi Samrat  Published on  9 Aug 2023 11:07 AM GMT
ఏపీ మంత్రులపై నాగబాబు సెటైర్లు

మెగాస్టార్ చిరంజీవి తన సినిమా వాల్తేరు వీరయ్య 200వ రోజు వేడుక సందర్భంగా మాట్లాడిన మాటలపై ఏపీ మంత్రులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలువురు మంత్రులు చిరంజీవికి వ్యతిరేకంగా మాట్లాడారు.

తాజాగా మంత్రుల స్పందనపై నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ‘‘శ్రమని పెట్టుబడిగా పెట్టి, పన్నుని ప్రభుత్వానికి అనాపైసలతో సహా కట్టి, వినోదాన్ని విజ్ఞానాన్ని జనానికి పంచిపెట్టి, 24 క్రాఫ్ట్ లకి అన్నం పెడుతున్న ఏకైన పరిశ్రమ చిత్రపరిశ్రమ. ఏ పని లేనోడు పిల్లి తల గొరిగినట్టు.. నిజం మాట్లడిన వ్యక్తి మీద విషం కక్కుతున్నారు ఆంధ్రా మంత్రులు, ఆయన ఫోటో కోసం పడిగాపులు కాసినోళ్లు కూడా ఆయన మీద కారు కూతలు కూస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే మీ ముఖం మీదే పడుతుంది. మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన ఉండదు, అభివృద్ధి అనేదానికి అర్థమే తెలియదు. బటన్ నొక్కి కోట్లల్లో ముంచి వేల మందికి ఉచితాలు పంచడమే అభివృద్ధి అనుకుంటున్నారా? అభివృద్ధి చేయడానికి ఇంకేం మిగిలి లేదనుకుంటున్నారా..! మీ ఆలోచనలు ఎంత క్షీణించి పోయాయో అజ్ఞానంతో కూడిన మీ మాటలు వింటే అర్థం అవుతుంది. మీ దౌర్భాగ్యపు దుర్మార్గపు పాలనకి END CARD దగ్గర్లోనే ఉంది. NOTE: కాలం గాలమేస్తే ప్రకృతే శత్రువవుతుంది.. ఆరోగ్యాలు జాగ్రత్త.!🤫’’ అంటూ నాగ బాబు ట్వీట్ చేసారు. చిరంజీవి గురించి ఎలా పడితే అలా మాట్లాడడం కరెక్ట్ కాదని చిరంజీవి అభిమానులు అంటున్నారు.

Next Story