ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. వ్యవసాయానికి మరిన్ని రుణాలు ఇవ్వనున్న నాబార్డ్
ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. వ్యవసాయానికి మరిన్ని రుణాలు ఇవ్వనున్న నాబార్డ్
By అంజి Published on 5 Dec 2024 7:40 AM ISTఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. వ్యవసాయానికి మరిన్ని రుణాలు ఇవ్వనున్న నాబార్డ్
అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయానికి మరిన్ని రుణాలు అందించేందుకు తమ సహకారం ఉంటుందని నాబార్డు చైర్మన్ షాజీ కృష్ణన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబుతో కృష్ణన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురి మధ్య కీలక చర్చ జరిగింది. వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, పరిశ్రమలకు సహకారం, మత్స్యరంగం వంటి అంశాలపై చర్చించారు. డ్వాక్రా గ్రూపులు, రైతులను పారశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రయత్నిస్తామని నాబార్డు చైర్మన్ షాజీ చెప్పారు.
అటు రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద పీపీపీ విధానంలో రాష్ట్ర వాటాగా వయబిలిటీ గ్యాప్ నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి ఎఫ్‌ఐడీఎఫ్ కింద అదనపు నిధులు, కేటాయింపులు, రాయితీలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. రాజధానిలో నాబార్డు ఐకానిక్ భవనాన్ని యేడాదిన్నరలో పూర్తి చేస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలను నాలెడ్జ్ ఎకానమీలో మరింత మెరుగు పరిచేందుకు పూర్తి మద్దతిస్తామని చెప్పారు. మత్స్యకార రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణం కోసం ఎఫ్‌ఐడీఎఫ్ కింద మంజూరైన రూ.450 కోట్ల వినియోగంపైనా సమావేశంలో చర్చ జరిగింది.