వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రాకూడదనే ఉమా ఆ వ్యాఖ్యలు చేశారా?

మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వెళ్ళబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూ ఉన్న సంగతి తెలిసిందే!!

By Medi Samrat  Published on  4 Jan 2024 9:15 PM IST
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రాకూడదనే ఉమా ఆ వ్యాఖ్యలు చేశారా?

మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వెళ్ళబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూ ఉన్న సంగతి తెలిసిందే!! ఆయన వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యల కారణంగా ఆయన ఇంట్రెస్ట్ అందరికీ అర్థం అవుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమా మైలవరం టికెట్ తనకే ఇస్తారని ఎదురుచూస్తూ ఉన్నారు. అందుకే వసంత కృష్ణ ప్రసాద్ రాకను దేవినేని ఉమా వర్గం వ్యతిరేకిస్తూ ఉంది.

అందుకే ఛాన్స్ దొరికిందని అనుకున్నారో ఏమో.. గుంటుపల్లి టౌన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. 25 ఏళ్లుగా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ముందుకు నడిచాను. గతంలో టీడీపీలో ఉన్నవారు తలో పార్టీలో చేరి ఆస్తులు సంపాదించుకున్నారు. నాపై హత్యాయత్నాలు కూడా జరిగాయి. ఇవాళ బతికున్నానంటే అందుకు కారణం కార్యకర్తలే. మరో రెండ్రోజుల్లో మైలవరం నియోజకవర్గంలో అన్నేరావుపేట నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నానని తేల్చి చెప్పారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, వసంత కృష్ణప్రసాద్ మైలవరంలో రూ.100 కోట్లు ఖర్చు పెడతామని చెబుతున్నారు. ఈ దుర్మార్గులు తమకు మైలవరం టికెట్ కావాలంటూ పార్టీ దూకి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. రూ.100 కోట్లు తెచ్చి ఎవడ్ని కొంటావురా నువ్వు? ఎవడికి కావాలి నీ డబ్బులు? ఇలాంటి వాళ్లను తరిమి తరిమి కొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు దేవినేని ఉమా.

Next Story