రోడ్డు ప్ర‌మాదంలో వైసీపీ ఎంపీపీ మృతి

MPP Prasanna Lakshmi died in road accident.రోడ్డు ప్ర‌మాదంలో వైసీపీ ఎంపీపీ ప్రసన్నలక్ష్మి మృతి చెందారు. కృష్ణా జిల్లా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2022 1:23 PM IST
రోడ్డు ప్ర‌మాదంలో వైసీపీ ఎంపీపీ మృతి

రోడ్డు ప్ర‌మాదంలో వైసీపీ ఎంపీపీ ప్రసన్నలక్ష్మి మృతి చెందారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండ‌లం తేల‌ప్రోలు-ఆనంద‌పురం ర‌హ‌దారిపై ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. ఎంపీపీ ప్రసన్నలక్ష్మి నిన్న(మంగ‌ళ‌వారం) ఎంపీపీ కార్యాలయంలో బాబు జగ్జీవన్‌ రాం జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంత‌రం సాయంత్రం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. ఆనంద‌పురం అడ్డ‌రోడ్డు వ‌ద్ద గుంత‌ల‌ను త‌ప్పించే స‌మ‌యంలో బైక్ అదుపు త‌ప్పి ర‌హ‌దారి మ‌ధ్య‌లో ఉన్న గుంత‌లో ప‌డింది.

ఈ ప్ర‌మాదంలో ఎంపీపీకి తీవ్ర గాయాలు కాగా.. భ‌ర్త‌కు స్వ‌ల్ప‌గాయాల‌య్యాయి. స్థానికులు వీరిని సిద్ధార్థ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా.. చికిత్స పొందుతూ నేడు(బుధ‌వారం) ఉద‌యం ఎంపీపీ ప్రసన్నలక్ష్మి మ‌ర‌ణించారు. ఆమె మృతి పట్ల వైసీపీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గ‌తేడాది కృష్ణా జిల్లా ఉంగుటూరు మండ‌లం తేల‌టూరు ఎంపీటీసీగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన ప్ర‌స‌న్న‌ల‌క్ష్మీ అనంత‌రం ఉంగుటూరు మండ‌లాధ్యక్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

Next Story