ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి శుక్రవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కాగా ఇదే కేసులో విచారణకు రావాలని జనవరి 19న జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. కాగా ఇప్పటికే ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గురువారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. నిన్న దాదాపు 8 గంటల పాటు విజయసాయిని ఈడీ అధికారులు విచారించారు. విజయసాయి వాంగ్మూలం ఆధారంగా ఇవాళ మిథున్‌రెడ్డి ఈడీ విచారించే అవకాశం ఉంది. అయితే మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.