లిక్కర్ స్కామ్‌పై రెండు ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదు.?

MP GVL Narasimha Rao On Liquor Scam. బీజేపీ సభ్యులు అని తెలీగానే వారికి హక్కుగా లభించే పథ‌కాలను కట్ చేస్తున్నారని

By Medi Samrat  Published on  24 Aug 2022 3:38 PM IST
లిక్కర్ స్కామ్‌పై రెండు ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదు.?

బీజేపీ సభ్యులు అని తెలీగానే వారికి హక్కుగా లభించే పథ‌కాలను కట్ చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కామెంట్ చేశారు. రేషన్ కార్డులపై అనర్హత వేటు వేయడమో, పెన్షన్షన్ తొలగించడమో చేస్తున్నారని.. పథకాలు తొలగించే క్రమంలో అధికారులు విచక్షణతో మెలిగాలని సూచించారు. పెద్ద సంఖ్యలో ఓటర్లను రద్దు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింది.. ఆంధ్రేతర ప్రాంతానికి చెందిన ఓటర్లను కావాలని జాబితాలోంచి తొలగించారని అన్నారు. ఈ విష‌య‌మై చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాశామ‌ని అన్నారు. 50 వేలకు తక్కువ కాకుండా ఓట్లు గల్లంతు చేశారని జీవీఎల్ ఆరోపించారు. ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఎలక్షన్ కమిషన్ ను కోరామని.. అందుకు చర్యలు మొదలయ్యాయని తెలిపారు. ఉద్దేశ పూర్వకంగా చేసినట్లు రుజువైన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరిన‌ట్లు తెలిపారు.

లిక్కర్ స్కామ్ పై ఢిల్లో లో డొంక కదిలితే ఆంధ్రా, తెలంగాణాల్లో మూలాలు వెలుగు చూస్తున్నాయని అన్నారు. రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీల‌కు సంబంధాలు వున్నట్లు తెలుస్తోందని అన్నారు. దీనిపై రెండు ప్రభుత్వాలు ఎందుకు స్పందించడంలేదని ప్ర‌శ్నించారు. లిక్కర్ స్కామ్ లో నిబంధనలు తుంగలోకి తొక్కరాని ఢిల్లీ చీఫ్ విజిలెన్స్ విభాగం నిర్ధారించిందని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం సమాధానం చెప్పడంలేదు. అమిత్ షా, జూనియ‌ర్‌ ఎన్టీఆర్ భేటీ రాజకీయ ప్రస్తావన లేకుండా వుండగలదా.. వారిద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయో వారే చెప్పాలని అన్నారు.


Next Story