మరో వివాదంలో ఎంపీ గోరంట్ల మాధవ్

MP Gorantla Madhav In another controversy. వైస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. మూడున్నర సంవత్సరాలుగా అద్

By M.S.R  Published on  10 Nov 2022 7:17 AM GMT
మరో వివాదంలో ఎంపీ గోరంట్ల మాధవ్

వైస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. మూడున్నర సంవత్సరాలుగా అద్దె, విద్యుత్తు బిల్లులు చెల్లించకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని గోరంట్ల మాధవ్ అద్దెకు ఉన్న ఇంటి యజమాని ఆరోపించారు. అనంతపురంలోని రాంనగర్ లో ఎంపీ మాధవ్ ఉంటున్నారు. మల్లికార్జున రెడ్డి అనే వ్య‌క్తి ఇంటిని గోరంట్ల మాధవ్ తాను ఎంపీగా గెలుపొందాక ఉండటం కోసం అద్దెకు అడిగారు. అద్దెకు దిగే సమయంలో 6 నెలలే ఉండి ఖాళీ చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంట్లోకి దిగిన దగ్గరి నుండి ఇంటి అద్దె కట్టడం లేదని , కరెంట్ బిల్లు కూడా కట్టడం లేదని మల్లికార్జున రెడ్డి వాపోయారు.

మూడున్నర సంవత్సరాల నుంచి అద్దెతో పాటు విద్యుత్తు బిల్లులు కూడా చెల్లించకపోవడంతో సెప్టెంబరు నెలలో ఖాళీ చేయాలని మల్లికార్జునరెడ్డి కోరారు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. గడువు ముగిసిన తర్వాత కూడా ఖాళీ చేయకపోవడంతో మల్లికార్జునరెడ్డి.. ఎంపీ దగ్గరకు వెళ్లి ఇంటిని ఖాళీ చేయాలని కోరారు. ఎంపీ వాగ్వాదానికి దిగడంతో పాటు ఇల్లు మారేది లేదంటూ తెగేసి చెబుతున్నారని మల్లికార్జునరెడ్డి చెప్పుకొచ్చారు. అద్దె కింద రూ.13 లక్షలు, విద్యుత్తు బిల్లుల కింద రూ. 2,50,413 చెల్లించాల్సి ఉందని మల్లికార్జునరెడ్డి తెలిపారు.


Next Story