సీబీఐ డైరెక్ట‌ర్‌కు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ‌

MP Avinash Reddy's letter to CBI Director Praveen Sood. వైఎస్ వివేకా హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ క‌డ‌ప‌ ఎంపీ అవినాష్ రెడ్డి..

By Medi Samrat  Published on  23 July 2023 2:58 PM GMT
సీబీఐ డైరెక్ట‌ర్‌కు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ‌

వైఎస్ వివేకా హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ క‌డ‌ప‌ ఎంపీ అవినాష్ రెడ్డి.. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు లేఖ రాశారు. వివేకా కేసును గతంలో విచారించిన ఎస్పీ రాంసింగ్‌పై లేఖలో సీబీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పక్షపాత వైఖరితో రాంసింగ్ కేసు దర్యాప్తు చేశారని లేఖ‌లో ఆరోపించారు. రాంసింగ్‌ చేసిన దర్యాప్తు తీరును సమీక్షించాలని అవినాష్ రెడ్డి లేఖ‌లో కోరారు. వివేకా రెండో వివాహం, బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ అంశాలు లేఖలో ప్రస్తావించారు.

దస్తగిరి నిలకడలేని సమాధానాల ఆధారంగా రాంసింగ్ విచారణ జరిపారని అవినాష్ రెడ్డి లేఖ‌లో ఆరోపించారు. రెండో భార్య పేరుతో ఉన్న ఆస్తి పత్రాలను ఎత్తుకెళ్లడానికే హత్య చేసి ఉండొచ్చన్న‌ కోణంలో విచారణ జరగలేదని అవినాష్ లేఖ‌లో పేర్కొన్నారు. విచారణలో రాంసింగ్ చేసిన తప్పులను సవరించాలని అవినాష్ రెడ్డి లేఖ‌లో కోరారు. నిజమైన నేరస్తులను పట్టుకుని న్యాయం చేయాలని అవినాష్ సీబీఐ డైరెక్టర్ ను కోరారు. సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జ్ షీట్ల ఆధారంగా అవినాష్ లేఖ రాసినట్లు తెలుస్తోంది.

Next Story