విషాదంలో వైసీపీ నేత‌లు : ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కన్నుమూత‌

MLC Challa Ramakrishna Reddy Passed Away. వైసీపీ నేత‌, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కన్నుమూశారు.

By Medi Samrat  Published on  1 Jan 2021 10:38 AM IST
MLC Challa Ramakrishna Reddy

వైసీపీ నేత‌, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కన్నుమూశారు. కరోనా సోకి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో మృతి చెందారు. గత నెల 13న కరోనాతో ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆయన కన్నుమూశారు. చల్లా రామకృష్ణారెడ్డిది కర్నూలు జిల్లా అవుకు మండలం ఉప్పలపాడు.

చల్లా రామకృష్ణా రెడ్డి 1983లో పాణ్యం ఎమ్మెల్యేగా గెలిపొందారు. 1989లో డోన్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1991లో నంద్యాల పార్లమెంట్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. 1994లో కోవెలకుంట్ల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి సిట్టింగ్‌ ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. 2009లో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి టికెట్‌ రాకపోవడంతో టీడీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థి బీసీ జనార్దనరెడ్డిని ఒంటి చేత్తో గెలిపించారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఏపీ సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. అనంత‌రం 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసి.. వై‌సీపీలో చేరారు.



Next Story