'స్కూళ్ల విలీనం ఆపాలి'.. మంత్రి బొత్సకు ఎమ్మెల్యేల లేఖల వెల్లువ

MLAs letters to minister botsa to stop merger of schools. ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్ల విలీనాన్ని అధికారిక పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు.

By అంజి  Published on  19 July 2022 5:11 AM GMT
స్కూళ్ల విలీనం ఆపాలి.. మంత్రి బొత్సకు ఎమ్మెల్యేల లేఖల వెల్లువ

ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్ల విలీనాన్ని అధికారిక పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. స్కూళ్ల విలీనాన్ని నిలిపివేయాలంటూ 60 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు లేఖలు రాశారు. స్థానికంగా విద్యార్థులకు ఇబ్బందులు వస్తాయని, విలీనాన్ని నిలిపివేయాలని కోరారు. ఎలక్షన్‌ టైమ్‌లో సమస్యలు తలెత్తే ఛాన్స్‌ ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ చాలా చోట్ల విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నారు. కొందరు వేరే స్కూళ్లకు వెళ్తామని, టీసీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విలీనంపై సమస్యలు తెలపాలంటూ ఎమ్మెల్యేలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల లేఖ రాశారు.

రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా అసెంబ్లీకి వస్తున్నందున ఆయా సమస్యలను లిఖిత పూర్వకంగా తెలియచేయాలంటూ పేర్కొన్నారు. దీంతో అసెంబ్లీకి వచ్చిన వారిలో 60మందికిపైగా ఎమ్మెల్యేలు మంత్రి బొత్సకు లేఖలు ఇచ్చారు. ఒక్కో ఎమ్మెల్యే మూడు నుంచి నాలుగు స్కూళ్ల వివరాలను పేర్కొన్నారు. కాగా ఈ లేఖలపై ఓ నిర్ణయం తీసుకోవాలని మంత్రి బొత్స ఆలోచన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,250 పాఠశాలలను విలీనం చేస్తుండగా.. వీటిలో 270 పాఠశాలలకు వెళ్లేందుకు వాగులు, వంకలు, రోడ్లను దాటి వెళ్లాల్సి వస్తోంది.

Next Story