విజయమ్మను కలిసినా రాజకీయమేనా..?

MLA Srikanth Reddy Fire On TDP Leaders. అవినాష్ రెడ్డి విజయమ్మను కలిసినా రాజకీయం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విపక్షాలపై

By M.S.R  Published on  28 Jan 2023 6:45 PM IST
విజయమ్మను కలిసినా రాజకీయమేనా..?

అవినాష్ రెడ్డి విజయమ్మను కలిసినా రాజకీయం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తోందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. హత్య ఎవరు చేశారు.. ఎందుకు చేశారో ఇప్పటికే తేలిపోయిందని ఆయన అన్నారు. అవినాష్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలని కుట్ర పన్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. అవినాశ్ రెడ్డి విచారణ పారదర్శకంగా జరగాలని ఆయనకు పార్టీ పూర్తిగా అండగా వుంటుందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. విచారణను వీడియో రికార్డింగ్ చేయాలని.. ఆయన విచారణ ద్వారా ప్రజలకు నిజాలు తెలిసే అవకాశాలు వున్నాయని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మాదిరిగా సీబీఐ రాష్ట్రంలోకి రావొద్దని అనలేదన్నారు. విజయమ్మే మా అందరికీ పెద్ద దిక్కని, ఆమె దగ్గరికి వెళ్లి అవినాశ్ ఆశీర్వాదం తీసుకున్నాడని శ్రీకాంత్ రెడ్డి వివరించారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ విచారణకు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హాజరయ్యారు. విచారణకు హాజరవ్వడానికి కొన్ని గంటల ముందు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మను వైఎస్ అవినాశ్ కలిశారు. లోటస్ పాండ్ కు వెళ్లి ఆమెతో సమావేశమయ్యారు.


Next Story