కృష్ణపట్నం పోర్టు విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాడి చేశారు. తనిఖీలు లేకుండా తన మనుషులను పోర్టు లోపలికి పంపలేదనే కారణంతో సెక్యూరిటీ సిబ్బందిపై ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. తమకే అడ్డు చెబుతారా.? అంటూ ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో సిబ్బందిని దూషించారు.
కృష్ణ పట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ పనులు నిలిచి పోయాయి. వీధిన పడ్డ ఉద్యో గుల కోసం పోర్టు సీఈవోతో మాట్లాడేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఎం పార్టీల నేతలతో మీడియా ప్రతినిధులు కూడా వెళ్లారు. అయితే మీడియాను పోర్టు సిబ్బంది అడ్డుకున్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పినా సెక్యూరిటీ వినిపించుకోలేదు. దీంతో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరులో కృష్ణపట్నం టెర్మినల్ తరలింపుకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి అన్ని పార్టీలు మద్దతుతో పోరాడుతామన్నారు. 10వేల మంది ఉద్యోగాలు పోయాయని, టెర్మినల్ ను పునరుద్ధరించాలని ఆదానీని కోరుతున్నామని తెలిపారు.