జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ హైదరాబాద్‌లో అమ్ముడుపోయి తిరుపతి సీటు కోసం ఢిల్లీలో వెళ్లారని విమర్శించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన రోజా.. పవన్‌ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎవరైనా పార్టీ పెట్టారంటే సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్తారు గానీ, వేరే పార్టీలకు ఓటేయమని అడగడం ఏంటని ప్రశ్నించారు. జనసేన పార్టీ స్థాపించినప్పుడు బీజేపీ, టీడీపీతో వెళ్లారు.. ఇప్పుడేమో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో తప్పుకుని

తూ జనసేనానిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎవరైనా పార్టీ పెట్టారంటే సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్తారు గానీ.. వేరే పార్టీలకు ఓటేయమని అడగడమేంటి? అని ప్రశ్నించారు. జనసేన పార్టీ స్థాపించినప్పుడు బీజేపీ, టీడీపీతో వెళ్లారు. ఇప్పుడేమో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో తప్పుకుని తిరుపతి సీటు కోసం మాట్లాడుతున్నారన్నారు. గ్రేటర్‌లో కేసీఆర్‌ గెలవకూడదంటా.. ఇదేంటో అర్థం కావడం లేదన్నారు. గ్రేటర్‌లో ఎవరిని గెలిపించాలో అక్కడ ప్రజలు నిర్ణయించుకుంటారని అన్నారు. వీళ్ల గుణాలు ఏంటో అర్ధం చేసుకోవాలని అన్నారు. ఏపీలో బీజేపీ, జనసేన ఉనికే లేదని అన్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైసీపీదే విజయమని రోజా ధీమా వ్యక్తం చేశారు.

రాజకీయ లబ్ది కోసమే విపక్షాలు పని చేస్తున్నాయిన రోజు మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను తొక్కేసి అధికారంలోకి రావాలని విపక్షాలు పని చేస్తున్నాయని ఆరోపించారు. పారదర్శకమైన రాజకీయాలు చేయకుండా నీచమైన కుట్ర రాజకీయాలు చేయాలని విపక్షాలు చూస్తున్నాయని మండిపడ్డారు.

సుభాష్

.

Next Story