గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అస్వస్థతకు గురి కాగా.. అతడిని వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. రామకృష్ణారెడ్డికి ఒక్కసారిగా ఛాతి నొప్పి వచ్చింది. ప్రస్తుతం ఆర్కేకు వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. చికిత్స కోసం ఎమ్మెల్యే ఆర్కే ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఆర్కే ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. ఆయనకు కొద్ది రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ఆర్కే బిజీ బిజీగా ఉంటున్నారు.
శనివారం నాడు మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పరిశీలించారు. అక్కడి నుండి నరసింహాస్వామి టెంపుల్‌లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆర్కే.. ఆ తర్వాత పెదకాకానిలోని తన ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ఆర్కే అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే అతడిని గుంటూరులోని సాయిభాస్కర్ ఆస్పత్రికి తరలించారు. ఆర్కే ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉండటంతో నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.