ఎమ్మెల్యే ఇంటికి కూడ నిప్పుపెట్టిన ఆందోళ‌న‌కారులు

MLA Ponnada Satish house set on fire in Konaseema. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మంగళవారం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటికి

By Medi Samrat
Published on : 24 May 2022 9:05 PM IST

ఎమ్మెల్యే ఇంటికి కూడ నిప్పుపెట్టిన ఆందోళ‌న‌కారులు

కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మంగళవారం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు. జిల్లాకు డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా కోనసీమలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రవాణా శాఖ మంత్రి పి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు.

అమలాపురం, కోనసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నేప‌థ్యంలో శాంతిభద్రతలు అదుపులో లేవ‌ని తెలుస్తోంది. మరోవైపు అమలాపురంలో జనాలను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఆందోళనల్లో కార్లు, ఫర్నీచర్‌, ఇతర విలువైన వస్తువులతో సహా కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు.










Next Story