ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLA Kotamreddy Sridhar Reddy sensational comments on phone tapping.ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన
By తోట వంశీ కుమార్ Published on 1 Feb 2023 11:55 AM ISTనెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను వైసీపీ నుంచి పోటి చేయనని చెప్పారు.
ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తోందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత రెండు రోజులుగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం మీడియా సమావేశాన్ని నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి విధేయుడినని చెప్పారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండాను భుజాన వేసుకుని కష్టపడినట్లు తెలిపారు. కొన్ని రోజులుగా ఇంటెలిజెన్స్ అధికారులు నాపై నిఘా పెట్టారు. ఈ విషయాన్ని నాలుగు నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి నాకు చెప్పారు. అయితే.. ముఖ్యమంత్రి జగన్‌ను ఇంతగా అభిమానించే, అధికారి పార్టీ ఎమ్మెల్యే అయిన తన ఫోన్‌ను ఎందుకు ట్యాప్ చేస్తారని అనుకునే వాడినని అన్నారు.
ఇటీవల ఓ అధికారి నుంచి నాకు ఫోన్ వచ్చింది. సీఎం జగన్‌కు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన నన్ను ప్రశ్నించారు. నా స్నేహితుడితో మాట్లాడిన ఆడియోను నాకు పంపిచారు. ఆధారాలు లేకుండా నేను మాట్లాడను. అనుమానం ఉన్న చోట నాకు ఉండాలని లేదు. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో మాత్రం వైసీపీ నుంచి పోటీ చేయాలని లేదు. నా మనస్సు అందుకు అంగీకరించడం లేదు. నా సంజాయిషీ అడగకుండానే నాపై చర్యలు చేపట్టారు.
ఒక్క ఎమ్మెల్యేతోనే ఫోన్ ట్యాపింగ్ ఆగదు. మంత్రులు, న్యాయమూర్తులు, ఐపీఎస్ ల ఫోన్లు, విలేకరులు, మీడియా యాజమాన్యాల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారు. నేను ఆధారాలు బయటపెడితే ఐపీఎస్ అధికారులకు ఇబ్బందులు తప్పవు. ఒక ఎమ్మెల్యేగా తనకు కార్యకర్తల కష్టం ఏంటో తెలుసునని చెప్పారు. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆవేదన చెందారు.