వైసీపీ నేతలకు పుట్టగతులు ఉండవు.. తాడేపల్లి ప్యాలెస్ గోడలు బద్దలు అవడం ఖాయం

MLA Gottipati Ravi Comments On YSRCP Leaders. నారా భువనేశ్వరి గురించి మాట్లాడిన వైసీపీ నేతలకు పుట్టగతులు ఉండవని టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి

By Medi Samrat  Published on  20 Nov 2021 6:40 PM IST
వైసీపీ నేతలకు పుట్టగతులు ఉండవు.. తాడేపల్లి ప్యాలెస్ గోడలు బద్దలు అవడం ఖాయం

నారా భువనేశ్వరి గురించి మాట్లాడిన వైసీపీ నేతలకు పుట్టగతులు ఉండవని టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి అన్నారు. ఎన్టీఆర్ కుమార్తె గురించి మాట్లాడిన వైసీపీ నేతలను చూసి సభ్యసమాజం తలదించుకుంటుందని ఫైర్ అయ్యారు. చంద్రబాబు కన్నీరు పెట్టారు అని ఆనందంలో ఉన్న వైసీపీ నేతలకు త్వరలోనే అసలు సినిమా చూపిస్తామ‌ని హెచ్చ‌రించారు. ప్రజా క్షేత్రంలో వైసీపీ తప్పులను ఎండగట్టడానికి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తామని తెలిపారు. 2024లో అసెంబ్లీలోకి ఎందుకు అడుగుపెట్టామా అని వైసీపీ నేతలు భాదపడేలా టీడీపీ ప్రణాళిక ఉంటుందని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. వచ్చే ఎన్నికలతో తాడేపల్లి ప్యాలెస్ గోడలు బద్దలు అవడం ఖాయమ‌ని జోస్యం చెప్పారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. చట్టసభలను గౌరవించే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలు వైసీపీ అంతానికి నాంది పలుకుతాయని చెప్పారు. అసెంబ్లీలో అడుగుపెట్టనని చంద్రబాబు అన్నారంటే... వైసీపీ దుర్మార్గులు ఆయనను ఎంత బాధ పెట్టారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. చంద్రబాబును వైసీపీ మంత్రులు దూషిస్తుంటే జగన్ వెకిలినవ్వులు నవ్వుతాడా? అని మండిపడ్డారు.



Next Story