జ‌గ‌న్‌ ప్రజల్లోకి వెళితే ఛీత్కారాలు తప్పవు : ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

ఎమ్మెల్యే, టీడీపీ సీనియ‌ర్ నేత‌ గంటా శ్రీనివాసరావు సీఎం జ‌గ‌న్‌పై మ‌రోమారు వ్యాఖ్య‌లు చేశారు.

By Medi Samrat  Published on  13 Jan 2024 12:25 PM GMT
జ‌గ‌న్‌ ప్రజల్లోకి వెళితే ఛీత్కారాలు తప్పవు : ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

ఎమ్మెల్యే, టీడీపీ సీనియ‌ర్ నేత‌ గంటా శ్రీనివాసరావు సీఎం జ‌గ‌న్‌పై మ‌రోమారు వ్యాఖ్య‌లు చేశారు. విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నేడు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. భీమిలి నుంచి జగన్ ప్రజాయాత్రలు ప్రారంభిస్తారంట..! అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రజల్లోకి వెళితే ఛీత్కారాలు తప్పవని అన్నారు. జగన్ తన అంతరాత్మను పరిశీలించుకోవాలని.. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీకి ఒక్క స్థానం కూడా రాద‌ని జోస్యం చెప్పారు.

రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల తిరుగుబాటు ఎప్పుడూ చూడలేదని, జగన్ ఎంపీలకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదని గంటా విమర్శించారు. ఆయన్ను రెండుసార్లే కలిసినట్లు కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్‌ చెప్పారు. దీంతో వైసీపీ నేతలు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారని వ్యాఖ్యానించారు. సగానికి సగం మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా బయటికి వచ్చే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. క్రికెటర్ అంబటి రాయుడు ఏదో అనుకుని వైసీపీలోకి వెళ్లాడని.. కానీ పరుగులు చేయకుండానే బయటికి వచ్చేశాడని పేర్కొన్నారు. పెనమలూరు సీనియర్‌ ఎమ్మెల్యే ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

Next Story