Video : త‌న‌పై దాడి చేసిన ఎమ్మెల్యేకు అదే స్టైల్‌లో స‌మాధాన‌మిచ్చిన‌ ఓట‌ర్‌..!

గుంటూరు జిల్లా తెనాలిలో దారుణ‌ సంఘ‌ట‌న జ‌రిగింది. క్యూలైన్లో నిల‌బ‌డి ఓటు వేయాల‌ని సూచించిన ఓట‌ర్‌పై ఎమ్మెల్యే దాడి చేశారు.

By Medi Samrat  Published on  13 May 2024 11:53 AM IST
Video : త‌న‌పై దాడి చేసిన ఎమ్మెల్యేకు అదే స్టైల్‌లో స‌మాధాన‌మిచ్చిన‌ ఓట‌ర్‌..!

గుంటూరు జిల్లా తెనాలిలో దారుణ‌ సంఘ‌ట‌న జ‌రిగింది. క్యూలైన్లో నిల‌బ‌డి ఓటు వేయాల‌ని సూచించిన ఓట‌ర్‌పై ఎమ్మెల్యే దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. వివ‌రాళ్లోకెళితే.. తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ త‌న అనుచ‌రుల‌తో క‌లిసి ఐతనగర్లో ఓటు వేయటానికి వెళ్లారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఎమ్మెల్యే క్యూలైన్లో కాకుండా నేరుగా ఓటు వేయటానికి వెళ్ల‌టంతో.. లైన్‌లో వేచి ఉన్న‌ ఓటర్ అభ్యంతరం చెప్పాడు. క్యూలైన్‌లో నిలుచొని ఓటు వేయాల‌ని సూచించాడు. దీంతో ఎమ్మెల్యే ఓటర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెంపపై కొట్టాడు. వెంట‌నే స్పందించిన ఓట‌ర్ ఎమ్మెల్యేను కూడా తిరిగి చెంపపై కొట్టాడు. దీంతో ప‌క్క‌నే ఉన్న ఎమ్మెల్యే అనుచ‌రులు క‌లుగ‌జేసుకుని ఓట‌ర్‌పై పిడిగుద్దులు కురిపించారు. ఓట‌ర్‌పై జ‌రిగిన దాడిని చూసిన ఓట‌ర్లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఎమ్మెల్యే తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.


Next Story