అందుకే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు: పెద్దిరెడ్డి

ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ అధికారులు ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం పట్ల వైసీపీ సీనియర్ నేత, మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు.

By అంజి
Published on : 20 July 2025 5:00 PM IST

Mithun Reddy, arrest, YS Jagan, Peddireddy Ramachandra Reddy, APnews

అందుకే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు: పెద్దిరెడ్డి 

ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ అధికారులు ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం పట్ల వైసీపీ సీనియర్ నేత, మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్ తో సన్నిహితంగా ఉంటున్నాడనే మిథున్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ కలిసి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జిల్లాలో మా కుటుంబానికి ఉన్న పట్టు చూసి చంద్రబాబు తట్టుకోలేక ఇలా విద్వేషం ప్రదర్శిస్తున్నారన్నారు.

చంద్రబాబు తప్పక ఫలితం అనుభవిస్తారు. ఇలాంటి నియంతలు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. గతంలోనూ, ఎయిర్ పోర్ట్ మేనేజర్ ను కొట్టాడని మిథున్ పై కేసు పెట్టారు. ఆ తర్వాత అది తప్పుడు కేసు అని తేలింది. మదనపల్లె ఫైల్స్ అన్నారు, అది ఏమీ తేల్చలేకపోయారన్నారు పెద్దిరెడ్డి. మిథున్ కడిగిన ముత్యంలా బయటికి వస్తాడని, మిథున్ తప్పుచేయలేదు కాబట్టి బయపడాల్సిన పనిలేదని అన్నారు.

లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ పార్లమెంట్ సభ్యుడు మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్‌పై జరిగిందనే ఆరోపణలతో దర్యాప్తునకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి అరెస్టుతో ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. ఎంపీ మిథున్ రెడ్డిని ఏపీ లిక్కర్ స్కాంలో ఏ4గా చేర్చారు. వివాదాస్పద మద్యం పాలసీ రూపకల్పనలో మిథున్ రెడ్డి కీలకపాత్ర పోషించినట్టు సిట్ గుర్తించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విజయవాడలోని తమ కార్యాలయంలో దాదాపు ఏడు గంటల పాటు ఆయనను విచారించింది.

Next Story