ఏపీకి రండి - పెట్టుబ‌డులు పెట్టండి.. ద‌క్షిణ కొరియా కంపెనీల‌కు మంత్రులు ఆహ్వానం

విజ‌న‌రీ లీడ‌ర్ చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ‌ట్ బిజినెస్ ను చేత‌ల్లో చూపిస్తున్నామ‌న్నారు మంత్రులు నారాయ‌ణ‌,బీసీ జ‌నార్ధ‌న్ రెడ్డి.స‌మ‌ర్ధ నాయ‌క‌త్వంతో కేవ‌లం 15 నెల‌ల్లోనే ఏపీకి 10 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు ఆకర్షించ‌గ‌లిగామ‌ని తెలిపారు

By -  Medi Samrat
Published on : 30 Sept 2025 7:50 PM IST

ఏపీకి రండి - పెట్టుబ‌డులు పెట్టండి.. ద‌క్షిణ కొరియా కంపెనీల‌కు మంత్రులు ఆహ్వానం

విజ‌న‌రీ లీడ‌ర్ చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ‌ట్ బిజినెస్ ను చేత‌ల్లో చూపిస్తున్నామ‌న్నారు మంత్రులు నారాయ‌ణ‌,బీసీ జ‌నార్ధ‌న్ రెడ్డి.స‌మ‌ర్ధ నాయ‌క‌త్వంతో కేవ‌లం 15 నెల‌ల్లోనే ఏపీకి 10 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు ఆకర్షించ‌గ‌లిగామ‌ని తెలిపారు..అందుకే రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు రావాల‌ని ద‌క్షిణ కొరియా పెట్టుబ‌డిదారుల‌ను ఆహ్వానిస్తున్నామ‌న్నారు...న‌వంబ‌ర్ లో విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగే సీఐఐ పార్ట‌న‌ర్ షిప్ స‌మ్మిట్ కు రావాల్సిందిగా ద‌క్షిణ కొరియా ఇన్వెస్ట‌ర్స్ ను ఆహ్వానిస్తున్నారు..మూడు రోజులుగా ద‌క్షిణ కొరియా రాజ‌ధాని సియోల్ లో ప‌ర్య‌టిస్తున్న మంత్రులు....ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఉన్న అవ‌కాశాలు,ప్ర‌భుత్వం కల్పిస్తున్న స‌దుపాయాల‌ను అక్క‌డి పారిశ్రామిక వేత్త‌ల‌కు వివ‌రిస్తున్నారు...

మంగ‌ళ‌వారం ఉద‌యం సియోల్ లో కియా కార్ల ప‌రిశ్ర‌మ ప్ర‌ధాన కార్యాల‌యానికి వెళ్లిన మంత్రులు,ఇఆండియ‌న్ ఎంబ‌సీ,ఏపీ అధికారులకు కంపెనీ ప్ర‌తినిధులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు...కియా సంస్థ స్ట్రాట‌జిక్ బిజినెస్ ప్లానింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్,గ్లోబ‌ల్ ఆప‌రేష‌న్స్ డివిజ‌న్ ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మ‌య్యారు.ఇప్ప‌టికే అనంత‌పురంలో కియా యూనిట్ నుంచి కార్ల ఉత్ప‌త్తిలో ముందంజ‌లో ఉంది..గ్లోబల్ మార్కెట్ లో కియా కార్ల అమ్మకాలు,కియా యూనిట్ ల విస్తరణ పై చర్చ మంత్రులు,కంపెనీ ప్ర‌తినిధుల మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది..ఏపీలో కియా యూనిట్ కు ప్రభుత్వం అందిస్తున్న సహకారం,ప్లాంట్ విస్తరణ వంటి అంశాలపై చర్చించారు..సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో పెట్టుబడిదారులకు కల్పిస్తున్న అవకాశాలను కియా ప్రతినిధులకు మంత్రులు వివ‌రించారు...విశాఖలో నవంబర్ లో జరిగే పెట్టుబడిదారులకు హాజ‌రుకావాల‌ని ఆహ్వానించారు.

మ‌ధ్యాహ్నం సియోల్ లో లొట్టే(Lotte)సంస్థ ప్ర‌తినిధుల‌తో మంత్రులు భేటీ అయ్యారు.లొట్టే కార్పొరేష‌న్ కార్పొరేట్ డెవ‌ల‌ప్ మెంట్ టీమ్ హెడ్,మేనేజ‌ర్,గ్లోబ‌ల్ స్ట్రాట‌జీ డివిజ‌న్ వైస్ ప్రెసిడెంట్ తో పాటు ఇత‌ర ప్ర‌తినిధుల‌తో మంత్రులు,అధికారులు స‌మావేశ‌మ‌య్యారు.ప్రపంచవ్యాప్తంగా ఫుడ్, కెమికల్స్,ఫార్మా రంగాలలో పెట్టుబడులు పెట్టిన లొట్టే (Lotte) గ్రూప్ ను.. ఏపీకి ఆహ్వానించారు...ఏపీలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ముందుకు వ‌చ్చే వారికోసం ఎలాంటి ఆల‌స్యం లేకుండా సింగిల్ విండో విధానంలో అన‌నుమ‌తులు,ప్ర‌త్యేకంగా అధికారుల క‌మిటీతో వంద‌రోజుల్లో ప‌నులు ప్రారంభించే విధంగా చ‌ర్య‌లు తీసుకున్న విధానాన్ని లొట్టే కార్పొరేష‌న్ ప్ర‌తినిధుల‌కు వివ‌రించారు.సుస్థిర‌మైన నాయ‌క‌త్వంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాల‌ని,విశాఖ భాగ‌స్వామ్య స‌ద‌స్సుకు హాజ‌రుకావాల‌ని ఆహ్వానించారు.

సియోల్ ప‌ర్య‌ట‌న‌లో మంత్రుల‌తో పాటు ద‌క్షిణ కొరియాలోని ఇండియ‌న్ ఎంబ‌సీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిష‌న్నిషి కాంత్ సింగ్,ఫ‌స్ట్ సెక్ర‌ట‌రీ సంజ‌నా ఆర్య‌తో పాటు పెట్టుబ‌డులు,మౌళిక వ‌స‌తుల శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంటీ కృష్ణ బాబు,ఆర్ధిక శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ పీయూష్ గోయ‌ల్,ఏపీఈడీబీ అధికారులు పాల్గొన్నారు.

Next Story