విద్యార్థి మృతిపై మంత్రి సవిత దిగ్భ్రాంతి

చెరువులో ఈతకు వెళ్లి ఊపిరాడక బాపట్ల జిల్లా దుద్దుకూరు బీసీ బాలుర వసతి గృహం ఎనిమిదో తరగతి విద్యార్థి వరుణ్ తేజ్ దుర్మరణపాలయ్యాడు

By Kalasani Durgapraveen  Published on  8 Nov 2024 8:17 PM IST
విద్యార్థి మృతిపై మంత్రి సవిత దిగ్భ్రాంతి

చెరువులో ఈతకు వెళ్లి ఊపిరాడక బాపట్ల జిల్లా దుద్దుకూరు బీసీ బాలుర వసతి గృహం ఎనిమిదో తరగతి విద్యార్థి వరుణ్ తేజ్ దుర్మరణపాలయ్యాడు. విద్యార్థి మృతిపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విచారం వ్యక్తంచేశారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. దుద్దుకూరు బీసీ బాలుర వసతి గృహం ఎనిమిదో విద్యార్థి వరుణ్ తేజ్ హాస్టల్ పక్కనున్న జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడన్నారు.. శుక్రవారం సాయంత్రం పాఠశాల విడిచి పెట్టిన తరవాత మరో ముగ్గురు విద్యార్థులతో కలిసి పక్కనున్న చెరువులో స్నానానికి వెళ్లాడన్నారు. వరుణ్ తేజ్ ఒక్కడే స్నానానికి చెరువులో దిగాడని, ఈతకు రాకపోవడంతో నీటి మునిగి మృతిచెందాడని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. తోటి విద్యార్థులు చెప్పడంతో హాస్టల్ సిబ్బంది, స్థానికులు చెరువుకు చేరుకున్నారు. ఇదే విషయం పోలీసులకు, విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారమందించారన్నారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని వెలికితీసి, పోస్టు మార్టానికి పంపారని మంత్రి వెల్లడించారు. విద్యార్థి వరుణ్ తేజ్ మృతి బాధాకరమని, బాధిత తల్లిదండ్రులకు తన సానుభూతిని వ్యక్తంచేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ కు ఆదేశించామన్నారు. బాధిత విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి సవిత వెల్లడించారు.

Next Story