కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో వైద్య ఆరోగ్య రంగానికి పెద్ద పీట : మంత్రి సత్య కుమార్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆరోగ్య రంగానికి గతేడాది కంటే 12.9 శాతం అధికంగా నిధుల్ని కేటాయించడం పట్ల ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on  1 Feb 2025 7:59 PM IST
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో వైద్య ఆరోగ్య రంగానికి పెద్ద పీట : మంత్రి సత్య కుమార్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆరోగ్య రంగానికి గతేడాది కంటే 12.9 శాతం అధికంగా నిధుల్ని కేటాయించడం పట్ల ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయ‌న మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో వైద్య ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేశార‌న్నారు. పీహెచ్‌సీల్లో బ్రాడ్ బ్రాండ్ కనెక్టివిటీ ద్వారా టెలి మెడిసన్, మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ డయాగ్గినెస్ట్, ఏఐ ఆధారిత సేవలను అందించడానికి దోహద ప‌డుతుంద‌న్నారు. 36 లైఫ్ సేవింగ్స్ డ్రగ్స్ పై కస్టమ్స్ డ్యూటీ మినహాయించడం, రోగ నిర్ధారణ పరికరాలతో సహా మెడికల్ సుంకాలపై హేతు బద్ధీకరించడం జరిగింది.. 2025-26 బడ్జెట్ లో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.

2025-26లో దేశవ్యాప్తంగా 10,000 వైద్య విద్య సీట్లను పెంపొందించనున్నారు. దీని వల్ల 2030 నాటికి ప్రతి 1,000 రోగులకు ఒక వైద్యుడు (1:1000) అందుబాటులోకి రావడానికి దోహదపడుతుందన్నారు. రాబోయే ఐదేళ్లలో 75 వేల వైద్య సీట్లను పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. దేశంలోని 200 జిల్లా ఆస్పత్రుల్లో డేకేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది.. మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించే విధంగా ఉందన్నారు. నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ స్కి ల్లింగ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ను ఏర్పాటు చేయనుండటం వల్ల ఆరోగ్య సంరక్షణ పరికరాల మ్యానుఫ్యాక్చరింగ్ లో పర్యావరణ సమతుల్యత తీసుకువచ్చేలా ఇది ఉపయోగపడుతుందన్నారు. భీమా రంగంలో 100% FDI అనుమతించడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులకు మరిన్ని పాలసీలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు.

Next Story