'మా అన్నయ్య నాకు ముద్దు పెడితే పెడార్థాలు తీసున్నారు'.. మంత్రి రోజా ఫైర్‌

Minister Roja fires on trollers who are commenting on her brother kissing her. నగరి ఎమ్మెల్యే, సినీ నటి ఆర్‌ కె రోజా మంత్రి అయిన సందర్భంగా.. ఆమె సోదరుడు ఆమెను

By అంజి  Published on  2 Jan 2023 11:33 AM IST
మా అన్నయ్య నాకు ముద్దు పెడితే పెడార్థాలు తీసున్నారు.. మంత్రి రోజా ఫైర్‌

నగరి ఎమ్మెల్యే, సినీ నటి ఆర్‌ కె రోజా మంత్రి అయిన సందర్భంగా.. ఆమె సోదరుడు ఆమెను ముద్దు పెట్టుకున్నారు. దీనిపై సోషల్‌ మీడియాలో పలువురు నెటిజన్లు నెట్టింట ట్రోల్‌ చేశారు. కాగా తాజాగా సోషల్ మీడియా ట్రోల్స్‌పై ఆంధ్రప్రదేశ్ టూరిజం మంత్రి రోజా స్పందించారు. తనను విమర్శించడానికి టీడీపీ వాళ్లకు ఇప్పుడు జనసేన వాళ్లు కూడా తోడయ్యారని అన్నారు. జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలతో కలిసి తనను, తన కుటుంబాన్ని ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా.. జనసేన, టీడీపీ కార్యకర్తలపై ఫైర్‌ అయ్యారు.

బలమైన నేతలను నేరుగా ఎదుర్కోలేకే సోషల్‌ మీడియాలో అనుచిత మాటలు మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. తాను మంత్రి అయిన తర్వాత తన అన్న తనకు ముద్దు పెడితే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. సంబంధాల విలువ తెలిస్తే ప్రజలు ఎప్పుడూ చౌకబారు వ్యాఖ్యలు చేయరని ఆమె అన్నారు. తనకు అమ్మనాన్నలు లేరని, ఇద్దరు అన్నయ్యలే తనను పెంచి పెద్ద చేశారని చెప్పారు. స్కూలుకు వెళ్లినప్పుడు, కాలేజీకి వెళ్లినప్పుడు, షూటింగుల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నా.. 24 గంటలూ వాళ్లు తన కోసం పని చేస్తున్నారని చెప్పారు. అలాంటి అన్నయ్య గురించి కూడా వీళ్లు ట్రోల్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

Next Story