వైఎస్ షర్మిలపై విరుచుకుపడ్డ మంత్రి రోజా
ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే
By Medi Samrat Published on 9 Feb 2024 2:15 PM GMTఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే!! మొదట్లో కాస్త సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు ఆ తర్వాత షర్మిలపై విరుచుకుపడుతూ ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా చీఫ్ వైఎస్ షర్మిలపై విమర్శలు గుప్పించారు. విశాఖలో ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్‌ను మంత్రి రోజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనే చంద్రబాబు, షర్మిల తీరుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ బతికి ఉంటే కాంగ్రెస్ మీద ఉమ్మేసేవారని చెప్పిన షర్మిల.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆ పార్టీలో చేరిందంటూ రోజా ప్రశ్నించారు. జగన్ ను జైలుపాలు చేసిన పార్టీతో చేతులు కలిపి అన్యాయం చేశారని.. టూర్ లు పెట్టి ప్రచారం చేస్తున్నారని, తెలంగాణలో పోరాటం చేస్తా అని చెప్పి కాంగ్రెస్ లో విలీనం ఎందుకు చేసిందో షర్మిల చెప్పాలన్నారు. కుదిరితే తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి నుంచి, ఏపీకి రావాల్సిన 6 వేల కోట్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకి రావాల్సిన లక్ష 80 కోట్ల ఆస్తులు తీసుకురావాలని రోజా సవాల్ చేశారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో మాదిరిగానే టీడీపీతో పాటు ఆ పార్టీతో కలిసి వచ్చే పార్టీలతో ఏపీ ఓటర్లు ఆడుకుంటారని.. వారిని హైదరాబాద్ తరిలిమేస్తాన్నారు రోజా.
జగన్ ఫోటోలు చూస్తుంటే టీడీపీ నేతలకు కడుపుమంటగా ఉందని అన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రభుత్వం చేస్తోందని.. ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం ఫొటో కాకుండా దిష్టిబొమ్మ చంద్రబాబు ఫొటో పెట్టాలా అంటూ సెటైర్లు వేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన ప్రభుత్వ కార్యక్రమాలకు చిరంజీవి, పవన్ కల్యాణ్ ఫొటోలు పెట్టారా అని ప్రశ్నించారు.