నారా లోకేశ్‌పై మంత్రి రోజా ఫైర్‌

Minister Roja Fire On Lokesh. యువగళం పాదయాత్రలో నగరి పర్యటనలో మంత్రి రోజాపై నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు

By Medi Samrat
Published on : 14 Feb 2023 6:30 PM IST

నారా లోకేశ్‌పై మంత్రి రోజా ఫైర్‌

యువగళం పాదయాత్రలో నగరి పర్యటనలో మంత్రి రోజాపై నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రోజాను జబర్దస్త్ ఆంటీ అని.. నియోజకవర్గంలో భారీ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. లోకేశ్ పై మంత్రి రోజా మండిపడ్డారు. లోకేశ్ ను ఐరల్ లెగ్ అని, లోకేశ్ అంకుల్ అని సంబోధించారు. ఎవరి కుటుంబానికి ఎంత ఆస్తులు ఉన్నాయో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. పెద్దల గురించి ఎలా మాట్లాడాలో కూడా తెలియని వ్యక్తి లోకేశ్ అని.. ప్రజల ఉన్నతి కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. యువగళం పాదయాత్రకు జనాలు రావడం లేదని, దీంతో బెంగళూరు, చెన్నై నుంచి జనాలను తీసుకొస్తున్నారని విమర్శించారు.

నారా లోకేష్ నగరిలో మాట్లాడుతూ.. నగరిలో క్వారీల నుంచి జబర్దస్త్ ఆంటి వాటా అడిగిందని ఆరోపించారు. ఈ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది అంటే పుట్టినరోజు కేక్ కోసి పిల్లలకు ఇస్తామన్నట్లుగా ఉందని విమర్శించారు. నగరి నియోజకవర్గాన్ని జబర్దస్త్ ఆంటీ సొంత బంధువులకు కుటుంబ సభ్యులకు పంచిపెట్టిందని అన్నారు.


Next Story