తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన గురించి తెలిసిందే! చంద్రబాబు నాయుడు బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర నేతలతో చర్చలు జరిపిన తర్వాత అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకుంటారు. 2018లో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న టీడీపీ 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత కూటమిని పునరుద్ధరించాలనే ఆసక్తిని కనబరుస్తోంది.
ఇదిలావుంటే.. ఈ దేశంలోనే చంద్రబాబు డర్టీ పొలిటీషియన్ అని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసినా వైఎస్ జగన్.. మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తల్లి, భార్యని తిట్టిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ప్రధాని మోదీని తిట్టి, నల్ల జెండాలు ఎగురవేశారని.. మళ్ళీ ఇప్పుడు మోదీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడ్డాడన్నారు. అమిత్ షాపై తిరుమలలో చంద్రబాబు రాళ్లు వేయించాడు. ఇప్పుడు అమిత్ షా కాళ్ళు పట్టుకుంటున్నారని రోజా విమర్శించారు.