వైఎస్ కుటుంబ ఆస్తుల పంపకంపై మాట్లాడిన మంత్రి రోజా
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేస్తున్న హడావుడి చేస్తుంటే.. ఆమెకు రాజకీయ అవగాహన లేదనే విషయం అర్థమయిందని మంత్రి రోజా తెలిపారు
By Medi Samrat Published on 23 Feb 2024 2:06 PM GMTఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేస్తున్న హడావుడి చేస్తుంటే.. ఆమెకు రాజకీయ అవగాహన లేదనే విషయం అర్థమయిందని మంత్రి రోజా తెలిపారు. ఆమె పోరాటాలు, ఆరాటాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని.. సీఎం జగన్ పై కావాలనే విషం చిమ్ముతున్నారని అన్నారు. షర్మిలకు జగన్ సమానంగా ఆస్తులు పంచి పెట్టారని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారని అన్నారు. డీఎస్సీ విషయంలో అనవసరమైన వ్యాఖ్యలు మానుకోవాలని.. 1998, 2008, 2018లో ఇవ్వాల్సిన డీఎస్సీలను సీఎం జగన్ ఇచ్చారన్నారు. 17 వేల పోస్టులను భర్తీ చేశారని.. తాజాగా 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారని వివరించారు మంత్రి రోజా.
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. పేదల తలరాత మార్చాలనే ఆలోచనతో సీఎం జగన్ నిరంతరాయంగా కృషి చేస్తున్నారని అన్నారు. షర్మిల గురించి పెద్దగా మాట్లాడాలని అనుకోవడం లేదని.. ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ, సీఎం జగన్ ను జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేసారు. ఏం కష్టం వచ్చిందో తెలియదు.. షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారన్నారు. తెలంగాణలో పోటీ చేస్తామని తెలంగాణ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టారని.. మారేందుకు ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిందో తెలియదని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలను గతంలో తిట్టిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లడం హాస్యాస్పదమని అన్నారు. పదవి వద్దు అనుకుంటే అన్నతో కలసి పనిచేయాలి కానీ, రాజశేఖర్ రెడ్డి విలువలను కాంగ్రెస్ కాళ్ల వద్ద పెట్టవదన్నారు నారాయణ స్వామి.