ఏ చెట్టునడిగినా.. ఏ పుట్టనడిగినా 'జగన్‌' అనే వినిపిస్తుంది

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం మన ఏపీకి కేంద్రం మంజూరు చేసిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని

By Medi Samrat  Published on  25 Aug 2023 1:58 PM IST
ఏ చెట్టునడిగినా.. ఏ పుట్టనడిగినా జగన్‌ అనే వినిపిస్తుంది

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం మన ఏపీకి కేంద్రం మంజూరు చేసిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని సాలూరు నియోజకవర్గానికి కేటాయించి శంకుస్ధాపనకు వచ్చిన సీఎం జ‌గ‌న్‌కు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర ధన్యవాదాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గిరిజన యూనివర్శిటీ కోసం భూములిచ్చిన రైతులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియ‌జేశారు. మనకు యూనివర్శిటీ వస్తే గత టీడీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాలకు దూరంగా నిర్మించాలని ప్రయత్నించింది, కానీ మన సీఎం ప్రధానితోనూ, కేంద్ర పెద్దలందరితోనూ మాట్లాడి గిరిజన యూనివర్శిటీ గిరిజన ప్రాంతంలోనే ఉండాలని ఒప్పించారు. ఈ యూనివర్శిటీ గిరిజన ప్రాంతాలకు అందరికీ దగ్గరగా ఉంది. పొరుగు రాష్ట్రాలకు కూడా అనుకూలంగా ఉంది. ఈ ప్రాంతానికి ఈ యూనివర్శిటీ వెన్నెముకగా ఉంటుందన్నారు.

సీఎంకి గిరిజనులంటే ప్రేమ, అభిమానం, ఇక్కడ ఏ చెట్టునడిగినా ఏ పుట్టనడిగినా జగన్‌ అనే వినిపిస్తుంది. ఈ యూనివర్శిటీతో గిరిజనులకు మరింత మెరుగైన విద్య అందుతుందని సీఎం భావించారు, దేశంలో మరెక్కడా లేని విధంగా ఏపీ విద్యార్ధులకు అన్నీ అందుతున్నాయి. విద్య, వైద్యం మీద సీఎం ప్రత్యేక దృష్టిసారించారు. ఏపీలో 34 గిరిజన తెగలు ఉన్నాయి, గిరిజనులకు సామాజిక న్యాయం అమలుచేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఎక్కడా లేని విధంగా సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం మా సీఎం చేశారని కొనియాడారు.

Next Story