వైసీపీ జెండాలను తొలగించాలంటూ రెచ్చగొట్టింది బాబే

Minister Peddireddy Ramachandra Reddy Fire On Chandrababu. రాజకీయాల్లో శుంఠ, పనికిమాలిన వ్యక్తి చంద్రబాబేన‌ని రాష్ట్ర విద్యుత్, అటవీ,

By Medi Samrat  Published on  27 Aug 2022 8:57 AM GMT
వైసీపీ జెండాలను తొలగించాలంటూ రెచ్చగొట్టింది బాబే

రాజకీయాల్లో శుంఠ, పనికిమాలిన వ్యక్తి చంద్రబాబేన‌ని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణం, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. వైసిపి జెండాలను తొలగించాలంటూ రెచ్చగొట్టింది బాబేన‌ని.. కర్రలు, రాళ్ళతో వైసిపి వారిపై దాడికి ఉసిగొల్పాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బయటి నుంచి తీసుకువచ్చిన వారితో హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. కొల్లుపల్లిలో సురేష్ రెడ్డి, బయ్యారెడ్డితో పాటు రెండేళ్ళ పసిపాపపై కూడా రాళ్ళ దాడి చేశారని అన్నారు.

33 ఏళ్ళుగా దౌర్జన్యాలతోనే చంద్రబాబు గెలిచాడు.. కుప్పంలో గెలుపు ఇక కల్ల అని అన్నారు. నైతిక విలువలు లేని చంద్రబాబును ప్రజలు ఖచ్చితంగా ఓడిస్తారని జోస్యం చెప్పారు. 14 ఏళ్ళు సీఎంగా, 19 ఏళ్ళు కేబినెట్ హోదాలో ఉండి కుప్పంను పట్టించుకోలేదని అన్నారు. గాలేరి-నగరి, కుప్పం బ్రాంచి కెనాల్ ను బాబు ఎందుకు పూర్తి చేయలేదు? అని ప్ర‌శ్నించారు. కుప్పంతో చంద్రబాబుది అవసరానికి ఉన్న అనుబంధమేన‌ని అన్నారు.

నాలుగున్నరేళ్ళు సున్నం.. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు అన్నం.. ఇదీ బాబు స్కీమ్ అని అన్నారు. కుప్పంకు 10 వేల పక్కాగృహాలను మా ప్రభుత్వమే కేటాయించిందని అన్నారు. రూ.66 కోట్లు కుప్పం మున్సిపాలిటీకి మంజూరు చేశామ‌ని.. మీ హయాంలో అభివృద్ధి చేసి ఉంటే.. మేం ఇవ్వన్నీ చేయాల్సిన అవసరం ఉండేదా? అని ప్ర‌శ్నించారు. జగన్ పాలనను చూశాక.. ఇక గెలవలేమన్న భయంతోనే బాబు కుప్పం బాట ప‌ట్టార‌ని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు మానసిక పరిస్థితి దెబ్బతిన్నది. చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబీకులు శ్రద్ద చూపించాలి. కుప్పంలో టీడీపీ జెండాను ప్రజలు పీకేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.


Next Story