అందుకే ఈ తప్పుడు రాతలు : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సీఎం జగన్ తో విభేదాలు వచ్చాయని తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on  31 Dec 2023 2:45 PM GMT
అందుకే ఈ తప్పుడు రాతలు : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సీఎం జగన్ తో విభేదాలు వచ్చాయని తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి విభేదాలే ఉంటే తాను రాజకీయాల్లో ఉండే పరిస్థితి లేదని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు. సీఎం జగన్ ఒక ప్రాంతీయ పార్టీకి అధినేత అని.. ఆయనతో విభేదాలు వస్తే పార్టీ నుంచి బయటికి వచ్చేయాలి. అందుకే నన్ను పార్టీ నుంచి బయటికి వచ్చేలా చేయడానికే ఈ విధంగా రాస్తున్నారని ఆరోపించారు. నేను సీఎంతో సఖ్యంగా ఉంటే ఎల్లో మీడియా ప్రయోజనాలు నెరవేరవు.. అందుకే ఈ తప్పుడు రాతలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎల్లో మీడియా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్నదే ఆలోచన తప్ప మరేదీ లేదని అన్నారు. పద్మా జనార్దన్ రెడ్డిని తీసేయాలంటూ నేను చెప్పినట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు పెద్దిరెడ్డి.ఇలాంటి వార్తలు బాధాకరం. అలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు మంత్రి పెద్దిరెడ్డి.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే నేత. ఆయనను చాలా వరకూ వైసీపీలో నెంబర్ 2 అని చెబుతారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి కీలక నేతగా ఉన్నారు. అలాంటి ఆయనకు వైఎస్ జగన్ కు విబేధాలు వచ్చాయని కొన్ని మీడియా సంస్థలు ఇటీవల కథనాలను ప్రసారం చేశాయి. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

Next Story