ఆ ప్రాంతం ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డా.. అక్క‌డే ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌.!

తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు.

By -  Medi Samrat
Published on : 8 Nov 2025 1:44 PM IST

ఆ ప్రాంతం ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డా.. అక్క‌డే ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌.!

తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అడవిలో నాలుగు కిలోమీటర్లుపైగా ప్రయాణించిన ఆయ‌న‌.. రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టునీ పరిశీలించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతం మొత్తం పరిశీలించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణ ముఖీ నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది.? తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుంటి మడుగు వాగు ఒడ్డున కూర్చుని, పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. వాగుకి ఇరు వైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు. ఎర్రచందనం స్మగ్లింగ్, స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర తెలుసుకున్నారు.

Next Story