'కోరుకున్న చోట స్థలాలిస్తాం'.. ఆ రైతులకు మంత్రి నారాయణ గుడ్‌న్యూస్‌

రాజధాని అమరావతిలో వినూత్న కార్యక్రమానికి మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు. ఎర్రబాలెం గ్రామంలో పర్యటించిన ఆయన భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతుల నుంచి స్వయంగా అంగీకార పత్రాలు తీసుకున్నారు.

By అంజి  Published on  16 Sep 2024 1:28 AM GMT
Minister Narayana, farmers, land, capital Amaravati, APnews

'కోరుకున్న చోట స్థలాలిస్తాం'.. ఆ రైతులకు మంత్రి నారాయణ గుడ్‌న్యూస్‌

అమరావతి: రాజధాని అమరావతిలో వినూత్న కార్యక్రమానికి మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు. ఎర్రబాలెం గ్రామంలో పర్యటించిన ఆయన భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతుల నుంచి స్వయంగా అంగీకార పత్రాలు తీసుకున్నారు. ఎర్రబాలెంలో 11 మంది రైతుల నుంచి 12.27 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వీకరించినట్లు తెలిపారు. తమను సంప్రదిస్తే ఇళ్లకే వచ్చి భూములు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములు ఇచ్చే వారికి కోరుకున్న చోట స్థలాలు ఇస్తామని తెలిపారు. ఐఐటీ రిపోర్ట్‌ ఆధారంగా రాజధాని నిర్మాణ పనులు చేపడతామన్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతులకు ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న భూముల్లో ప్లాట్‌లు ఇస్తామని వివరించారు.

భూములు ఇచ్చిన మరుసటి రోజే ప్లాట్ ఎంపిక చేసుకునే ఛాన్స్‌ ఉంటుందన్నారు. రాజధాని కోసం రైతులు నేడు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి సిద్ధమయ్యారని మంత్రి నారాయణ తెలిపారు. గతంలో భూములు ఇచ్చిన రైతులకు లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు ఇచ్చామన్న మంత్రి.. ఇప్పుడు కొంత మేర భూములు మాత్రమే అవసరమని అన్నారు. అందుకే ఇప్పుడు భూములు ఇస్తున్న రైతులకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నామని మంత్రి ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం దగ్గర ఎక్కడ భూమి ఉందో.. అక్కడ వారు కోరుకున్న ప్లాట్లు ఇస్తామని మంత్రి నారాయణ అన్నారు.

Next Story