ఫస్ట్‌ ఇయర్‌లో 70%, సెకండియర్‌లో 83%.. గత పదేళ్లలో ఇదే అత్యధిక పాస్‌ పర్సెంటేజ్‌: లోకేష్‌

ఇంటర్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఓవరాల్‌గా ఫస్ట్‌ ఇయర్‌లో 70 శాతం, సెకండియర్‌లో 83 శాతం మంది విద్యార్థులు పాస్‌ అయినట్టు మంత్రి నారా లోకేష్‌ వెల్లడించారు.

By అంజి
Published on : 12 April 2025 11:44 AM IST

Minister Lokesh, students, Inter, Inter results

ఫస్ట్‌ ఇయర్‌లో 70%, సెకండియర్‌లో 83%.. గత పదేళ్లలో ఇదే అత్యధిక పాస్‌ పర్సెంటేజ్‌: లోకేష్‌ 

అమరావతి: ఇంటర్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఓవరాల్‌గా ఫస్ట్‌ ఇయర్‌లో 70 శాతం, సెకండియర్‌లో 83 శాతం మంది విద్యార్థులు పాస్‌ అయినట్టు మంత్రి నారా లోకేష్‌ వెల్లడించారు. 2014 నుంచి ఇదే అత్యధిక పాస్‌ పర్సెంటేజ్‌ అని తెలిపారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో సెకండియర్‌లో 69 శాతం మంది ఉత్తీర్ణత సాధించడం పదేళ్లలో అత్యధికమన్నారు. ఫస్టియర్‌లోనూ 47 శాతం మంది పాస్‌ అయ్యారని, ఇది దశాబ్దంలో రెండో అత్యధికమని తెలిపారు. ఇదిలా ఉంటే. విద్యార్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. అలాగే, మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కి "Hi" మెసేజ్ పంపితే కూడా ఫలితాలను పొందవచ్చు.

''ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైనందుకు ఆనందంగా ఉంది. మొదటి సంవత్సరం విద్యార్థులకు 70%, రెండో సంవత్సరం విద్యార్థులకు 83% ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రభుత్వ, ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69%గా నమోదు కాగా, ఇది గత 10 ఏళ్లలో అత్యధికం. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47%గా ఉంది, ఇది గత పదేళ్లలో రెండవ అత్యధిక శాతం. ఈ విజయానికి విద్యార్థులు, జూనియర్ అధ్యాపకులు, విద్యా పురోగతికి కృషి చేసిన ప్రతి ఒక్కరి కఠినమైన శ్రమే కారణం'' అని మంత్రి లోకేష్‌ తెలిపారు.

''ఈసారి ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందకండి. దీనిని ఒక అడుగుగా భావించి, మరింత కృషి చేసి, మరింత బలంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం. ప్రతి విద్యార్థికి శుభాకాంక్షలు. మీరు నిరంతరం నేర్చుకుంటూ, ఎదుగుతూ, విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను'' అని మంత్రి లోకేష్‌ పేర్కొంది.

Next Story