మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు వెంకటరమణ హఠాన్మరణం

రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు వెంకటరమణ హఠాన్మరణం చెందారు.

By అంజి  Published on  12 Dec 2024 3:21 AM GMT
Minister Kollu Ravindra, Venkataramana, heart attack, CM Chandrababu

మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు వెంకటరమణ హఠాన్మరణం

అమరావతి: రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు వెంకటరమణ హఠాన్మరణం చెందారు. బుధవారం రాత్రి గుండెపోటు రావడంతో వెంకటరమణను బంధువులు.. బందరులోని ఆంధ్రా హాస్పటిల్‌కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. అక్కడి నుంచి డెడ్‌బాడీని ఇంటికి తరలించారు. పలువురు ఎన్డీఏ కూటమి నాయకులు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. సోదరుడి మరణవార్త తెలుసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ నుంచి హుటాహుటిన మచిలీపట్నం బయలుదేరి వెళ్లారు.

వెంకటరమణ వ్యాపార వేత్త, ఆయనకు భార్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటరమణ హఠాన్మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకటరమణ మృతిపై ముఖ్యమంత్రి తన సంతాపం తెలిపారు. మంత్రి రవీంద్ర కుటుంబంలో ఇది తీవ్ర విషాదమని.. సోదరుని మృతిపై కొల్లు రవీంద్ర కుటుంబానికి తన సానుభూతి తెలుపుతున్నానని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్ధిస్తున్నట్లు సీఎం తెలిపారు.

Next Story