అక్టోబర్ 1న నూతన మద్యం పాలసీ : మంత్రి కొల్లు రవీంద్ర

ప్రజల ప్రాణాలు హరిస్తున్న కల్తీ మద్యం బ్రాండ్ల నుండి విముక్తి కలిగించేలా త్వరలోనే మెరుగైన పాలసీ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మ‌రియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

By Medi Samrat  Published on  7 Aug 2024 7:06 PM IST
అక్టోబర్ 1న నూతన మద్యం పాలసీ : మంత్రి కొల్లు రవీంద్ర

ప్రజల ప్రాణాలు హరిస్తున్న కల్తీ మద్యం బ్రాండ్ల నుండి విముక్తి కలిగించేలా త్వరలోనే మెరుగైన పాలసీ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మ‌రియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సచివాలయంలో మద్యం తయారీ ఎంఎన్‌సీ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. 2014-19 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని కేవలం ప్రైవేటు వ్యాపారంగా మాత్రమే భావించింది. దేశం మొత్తం లభించే బ్రాండ్లను ఏపీలో కూడా అందుబాటులో ఉంచింది. కానీ, 2019లో ప్రభుత్వం మారిన తర్వాత నాటి పాలకులు మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని ప్రజల ప్రాణాలు హరించారని ఆరోపించారు. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని మండిప‌డ్డారు.

సంక్షేమ పథకాలకు, మద్యం అమ్మకాలకు ముడి వేసి ప్రజల ఆదాయాన్ని హరించారన్నారు. అమ్మకాలకు, కొనుగోళ్లకు సంబంధమే లేకుండా వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. దేశమంతా డిజిటల్ పేమెంట్ల వైపు వెళ్తుంటే ఏపీలో మాత్రం క్యాష్ అండ్ క్యారీ విధానంలో మద్యం అమ్మకాలతో వేల కోట్ల లూటీ చేశారని.. వినియోగదారుడు తనకు నచ్చిన బ్రాండ్ కాకుండా.. ధర చెప్పి కొనుగోలు చేసే దుస్థితి కల్పించారని అన్నారు. కల్తీ మద్యం తీసుకొచ్చి వేలాది మంది మరణాలకు, అనారోగ్యానికి కారమయ్యారని అన్నారు. రాష్ట్రంలో జరిగిన మద్యం అక్రమాలను త్వరలోనే బయటపెడతామ‌న్నారు. అక్టోబర్ 1 నాటికి నతన మద్యం పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామ‌న్నారు. అందుకోసం మెరుగైన పాలసీల కోసం అధ్యయనం చేస్తున్నాం. నాణ్యమైన మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి కొల్లురవీంద్ర పేర్కొన్నారు.

Next Story