ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌లో కేటాయింపులపై ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెడతారు. బడ్జెట్ రూపకల్పనపై చాలా కాలంగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడనప్పటికీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉంటుందని పార్టీ నేతలు తెలిపారు.
మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజా సంక్షేమమే బడ్జెట్‌లో ముందుండేలా కనిపిస్తోంది. ముఖ్యంగా నవరత్నాలకు బడ్జెట్ లో మరిన్ని నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. జగనన్న కాలనీలు, విద్య, వైద్యానికి కూడా బడ్జెట్‌లో భారీ కేటాయింపులు ఉంటాయని సమాచారం. ప్రస్తుతం అమలవుతున్న పథకాలతో పాటు కొత్త పథకాలకు కూడా ఈ బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయా అనేది చర్చనీయాంశమైంది. అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్‌లో కేటాయింపులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం జగన్ వైద్యం, విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మరోవైపు వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం.