ముసుగులు వేసుకుని మళ్లీ మోసం చేయాడనికి వస్తే ఊరుకుంటారా..? : మంత్రి బొత్స
సామాజిక సాధికారతను వైసీపీ సాధించిందో లేదో చెప్పడానికి ఎస్. కోట సభకు వచ్చిన జనమే నిదర్శనమని..
By Medi Samrat Published on 4 Nov 2023 9:15 PM ISTసామాజిక సాధికారతను వైసీపీ సాధించిందో లేదో చెప్పడానికి ఎస్. కోట సభకు వచ్చిన జనమే నిదర్శనమని మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్ఘాటించారు. అంబేద్కర్ స్ఫూర్తి, ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వెనుకబడిన వర్గాలకు సామాజిక రాజకీయ సాధికారత జగన్ చూపారన్నారమన్నారు.. ఎన్నికల్లో ఏం చెప్పామో.. పాలనలో ఏమి చేసామో ప్రజలకు చెప్పడానికే మీ ముందుకు వస్తున్నామని బొత్స వివరించారు. ఎన్నికల్లో ఇష్టానుసారం హామీలు ఇచ్చేసి. ప్రజలనుంచి పారిపోయే పరిస్థితి మాకు లేదని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముసుగులు తీసి టీడీపీ, జనసేన దొంగలు వస్తున్నారన్నారని విమర్శించారు.
ముసుగులు వేసుకుని మళ్లీ మోసం చేయాడనికి వస్తే ఊరుకుంటారా.. అని ప్రజల్ని ప్రశ్నించారు. ఎన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఎదురైనా సరే నవరత్నాలను తూచా తప్పకుండా సీఎం జగన్ అమలు చేసారని గుర్తు చేసారు. దోపిడీ చేసి జైలుకు వెళ్తే ఆయన ఏదో మహానుభావుడు ఆయినట్లు నటిస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించి బొత్స ఎద్దేవా చేసారు. తప్పు చేసావా లేదా.. తప్పు చేయకపోతే రిమాండ్ ఎందుకు విధించారో చంద్రబాబు మనస్సాక్షిగా చెప్పాలని డిమాండ్ చేసారు. . రాష్ట్రానికి, ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి పాలన అవసరమని ఉద్ఘాటించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే దోపిడీలు, మధ్యవర్తులు, లంచగొండులు మళ్లీ వస్తారని బొత్స హెచ్చరించారు.. పారిశ్రామిక వాడకు కేబినెట్ లో జగన్ ఆమోదం తెలిపారని. అది అమల్లోకి వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు.. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.