ప్రజలు ఛీ కొట్టాక విలువలు గుర్తొచ్చాయా జగన్ రెడ్డీ.? : మంత్రి అచ్చెన్నాయుడు సంచ‌లన వ్యాఖ్య‌లు

ప్రతిపక్ష హోదా కూడా రాని స్థాయి ఓటమిని ప్రజలు కట్టబెట్టినా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు రావడంలేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

By Medi Samrat  Published on  7 Aug 2024 4:51 PM IST
ప్రజలు ఛీ కొట్టాక విలువలు గుర్తొచ్చాయా జగన్ రెడ్డీ.? : మంత్రి అచ్చెన్నాయుడు సంచ‌లన వ్యాఖ్య‌లు

ప్రతిపక్ష హోదా కూడా రాని స్థాయి ఓటమిని ప్రజలు కట్టబెట్టినా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు రావడంలేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. నైతిక విలువలు, విశ్వసనీయత అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా మీరే ముఖ్యమంత్రిననే భ్రమల్లో ఉంటే ఎలా.. పులివెందుల ఎమ్మెల్యే గారూ? భ్రమలు వీడి వాస్తవంలోకి రండి.. ప్రజా ప్రభుత్వ పాలన ఎలా ఉందో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని పోటీనే పెట్టకూడదనడానికి మీరెవరు? మీకు ఆ అధికారం ఎవరిచ్చారు? అని ప్ర‌శ్నించారు.

గతంలో రాజభవన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినప్పుడు 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. నేను తలుచుకుంటే టీడీపీ ప్రభుత్వం కూలిపోతుందని ప్రకటనలు చేసినప్పుడు విలువలు గుర్తుకురాలేదా? విలువల గురించి మాట్లాడే ముందు గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాన్ని లూఠీ చేసిన విధానం, అక్రమాస్తుల కేసులో సీబీఐ వేసిన 11 చార్జ్ షీట్ల గురించి ప్రజలకు చెప్పే దమ్ముందా? మీ శవ రాజకీయాలకు, వికృత రాజకీయ క్రీడలకు, విష సంస్క్రతికి కాలం చెల్లింది. మేం తలుచుకుంటే వైసీపీ ఖాళీ అయిపోతుందని అన్నారు.

Next Story