టమోటా ధరలు పతనం..రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు భరోసా
టమోటా ధరలపై రాష్ట్ర రైతులకు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు
By - Knakam Karthik |
టమోటా ధరలు పతనం..రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు భరోసా
అమరావతి: టమోటా ధరలపై రాష్ట్ర రైతులకు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. రాప్తాడు మార్కెట్‌లో ఆదివారం టమోటా ధరలు: గరిష్టం రూ.18, కనిష్ఠం రూ.9, మోడల్ ధర రూ.12 గా ఉన్నాయి. 30 నుండి 40 మెట్రిక్ టన్నులు మించి పత్తికొండ మార్కెట్ సరుకు రాదు, దసరా సెలవులు కావడంతో మరొక 10 టన్నులు అదనంగా చేరుకుంది.. రోడ్లపై 2వ గ్రేడ్ క్వాలిటీ టమాటాలు వేసి గందరగోళం సృష్టించారు . ఇప్పటివరకు 10 మెట్రిక్ టన్నుల టమోటాలను వివిధ రైతు బజార్లకు పంపించాము... ఈ రోజు పత్తికొండ మార్కెట్ లో టమోటాలు సేకరించి చిత్తూరు ప్రొసెసింగ్ యూనిట్ కి 10 మెట్రిక్ టన్నులు, రైతు బజార్లకు 15 మెట్రిక్ టన్నులు పంపిస్తాము.
తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు సరుకు ఎగుమతి వర్షాల వల్ల తగ్గింది, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో టమాటా అమ్మకాలు మందగించాయి. ఆదివారం రాప్తాడు మార్కెట్ కి 3000 మెట్రిక్ టన్నులు రాగా అందులో కేజీ టమోటా గరిష్టంగా 18 రూ, కనిష్టంగా 9 రూ జరిగింది. టమోటాలకు ట్రెండింగ్ ధరను బట్టి ప్రస్తుతం మంచి ధర లభిస్తుంది, ఏమైనా ఇబ్బందులు తలెత్తితే అన్ని విధాలుగా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది..అని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.