విశాఖ, అల్లూరి జిల్లాల్లో స్వల్ప భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

మంగళవారం తెల్లవారుజామున వైజాగ్ నగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

By -  అంజి
Published on : 4 Nov 2025 10:05 AM IST

Mild earthquake, Vizag, ASR district, APnews

విశాఖ, అల్లూరి జిల్లాల్లో స్వల్ప భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

విశాఖపట్నం: మంగళవారం తెల్లవారుజామున వైజాగ్ నగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

వైజాగ్‌లో ఉదయం 4.19 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయి. భూకంప శాస్త్రవేత్తల ప్రారంభ నివేదికలు.. రిక్టర్ స్కేలుపై భూకంపం దాదాపు 3.7గా నమోదైందని, దీనిని తక్కువ తీవ్రత కలిగిన సంఘటనగా వర్గీకరించారని సూచిస్తున్నాయి.

ఆరిలోవ, అడివివరం, మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్‌బీ కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలి, పెందుర్తి ప్రాంతాల్లో భూమి కంపించింది.

నివాసితుల ప్రకారం.. భూమి కొద్దిసేపు కంపించింది. ముఖ్యంగా భీమిలి బీచ్ రోడ్డు వెంబడి పెద్ద శబ్దంతో పాటు. సింహాచలం ప్రాంతం నుండి కూడా స్వల్ప ప్రకంపనలు సంభవించాయని నివేదించబడింది. ఈ ప్రకంపనలతో భయపడి, చాలా మంది తమ ఇళ్ల నుండి సురక్షితంగా బయటకు పరుగులు తీశారు.

ఎక్స్‌లో చాలా మంది నెటిజన్లు తమ ప్రాంతంలో తేలికపాటి భూకంపం గురించి పోస్ట్ చేశారు.

అధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు, అయితే ఇప్పటివరకు ఎటువంటి నష్టం లేదా ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తోంది.

కర్ణాటకలో ప్రకంపనలు:

కర్ణాటకలోని విజయపుర జిల్లాలో మంగళవారం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతతో స్వల్ప భూకంపం నమోదైంది.

నవంబర్ 3న తెల్లవారుజామున ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం సంభవించి, కనీసం 20 మంది మృతి చెందగా, 640 మందికి పైగా గాయపడ్డారు. ఈ భారీ భూకంపం చారిత్రాత్మక బ్లూ మసీదును కూడా దెబ్బతీసింది.

Next Story